టిడిపిలోకి జంప్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్న దేవినేని నెహ్రు. దేవినేని నెహ్రు అసలు మొదట్లో ఎన్టీఆర్ హయం లో తెలుగు దేశంలోనే ఉండేవారు. అయితే చంద్రబాబు వెన్నుపోటు సమయం లో ఆయన ఎన్టీఆర్ ని సమర్ధించి ఆయనతోనే వున్నారు. కాలక్రమం లో అయన కాంగ్రెస్ లో చేరారు. అయితే నెహ్రు ఎప్పటినుండో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. నెహ్రు కాంగ్రెస్ నుండి వైసిపిలో కి వెళతారు అనుకున్నారు అందరూ. కానీ ఒక సంవత్సర కాలం గా టిడిపిలోకి చేరడానికి నెహ్రు పావులు కదుపుతున్నారు. ఇక ఆయన తన తమ్ముడు భాజిప్రసాద్ మరణం తర్వాత టిడిపిలో చేరాలని మంతనాలు మొదలు పెట్టాడు. అయితే దీని కోసం ఆయన నారా లోకేష్, టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావుతో మంతనాలు జరిపారు. ఈయన 25 సంవత్సరాలు ఎమ్యెల్యేగా.... 10 సంవత్సరాలు మంత్రిగా పని చేసిన చరిత్ర వుంది. అయితే విజయవాడలో ఆయనకి మంచి పట్టు వుంది. ఆయన టిడిపిలోకి చేరడానికి ప్రధాన కారణం మాత్రం ఆయన తనయుడు అవినాష్ అని తెలుస్తుంది. దేవినేని లోకేష్ కి రాజకీయం గా ఎదగడానికి టిడిపి ఉపయోగపడుతుందని ఆయన భావించి టిడిపిలో చేరాలని ఫైనల్ గా నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది. ఇంకా ఆయన వెనుక వున్న కార్య కర్తలకోసం కూడా నెహ్రు టిడిపిలో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్యకర్తలు కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు ఉండదు గనక వారికి కూడా ఒక దారి చూపించడానికి అయన టిడిపిలో చేరుతున్నారని సమాచారం. ఇక నెహ్రు సెప్టెంబర్ 12 న లాంఛనం గా టిడిపిలో చేరడానికి ముహూర్తం ఖరారయ్యింది. ఇంకేమిటి టిడిపి ఇక విజయవాడలో కూడా గట్టి పట్టు సాధించినట్లే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇదిలా ఉంటే నెహ్రు టిడిపిలోకి రావడాన్ని టిడిపిలో వున్న నెహ్రు వ్యతిరేఖ వర్గీయులు ఎలా జీర్ణించుకుంటారో వేచి చూడాలి.