Advertisementt

అబ్బ.. చిరు ఏం ప్లాన్ చేశాడు..!!

Tue 30th Aug 2016 04:12 PM
megastar chiranjeevi,boyapati srinu,khaidi number 150,geetha arts,politics  అబ్బ.. చిరు ఏం ప్లాన్ చేశాడు..!!
అబ్బ.. చిరు ఏం ప్లాన్ చేశాడు..!!
Advertisement
Ads by CJ

గత 9 సంవత్సరాలుగా ముఖానికి మేకప్ వేసుకోకుండా రాజకీయాల్లో బిజీ గా మారిన  చిరంజీవి మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు 149 చిత్రాల్లో నటించిన చిరు తన 150 చిత్రం 'ఖైదీ నెంబర్ 150' తో అభిమానుల ముందుకు రావాలని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో చిరు కి జోడిగా కాజల్ నటిస్తుంది. ఇక చిరు  సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అందుకే 150 సినిమా సెట్స్ మీద ఉండగానే తన 151 సినిమా గురించి కూడా ఒక నిర్ణయానికి వచ్చాడట. అందుకే 151 చిత్రాన్ని మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయినా బోయపాటితో చేస్తాడని సమాచారం. బోయపాటి మాస్ కి పెట్టింది పేరు. ఇక బోయపాటితో నుండి వచ్చే మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు త్వరగా చేరువవ్వొచ్చని చిరంజీవి ప్లాన్ చేశాడట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే బోయపాటి శ్రీను బాలకృష్ణ కి 'సింహ, లెజెండ్' వంటి ఎదురులేని హిట్స్ ఇచ్చి రాజకీయ రంగ ప్రవేశానికి పరోక్షంగా సహాయం చేశాడనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే చిరు తెలివిగా అలోచించి బోయపాటికి అవకాశం ఇచ్చాడని అందరూ అనుకుంటున్నారు. బోయపాటితో సినిమా అయితే రాజకీయాలకు దూరంగా వున్నా..రాజకీయాల్లో వున్నట్లే లెక్కకి వస్తుందనేది చిరు ఆలోచనలా తెలుస్తుంది. ఇటు సినిమా, అటు రాజకీయం..రెండింటికి హాజరు పడుతుందనే బోయపాటి తో ప్లాన్ చేశారని టాక్. ఇక బోయపాటి విషయానికి వస్తే ముందు నుండి నందమూరి హీరోలతో సినిమాలు చేస్తూ ఇప్పుడు మెల్లగా మెగా క్యాంప్ వైపు కదులుతున్నాడు. మెగా హీరో అల్లు అర్జున్ కి 'సరైనోడు'తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఇప్పుడు చిరు సినిమాకి వర్క్ చెయ్యడం అదృష్టమనే చెప్పాలి. ఎంతైనా బోయపాటి అదృష్టవంతుడు కదా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ