Advertisementt

బాబూ..ఏపీ కోసం దీక్ష చేద్దాం..రా..!!

Tue 30th Aug 2016 03:03 PM
chandrababu naidu,deeksha,mudragada padmanabam,ap special status  బాబూ..ఏపీ కోసం దీక్ష చేద్దాం..రా..!!
బాబూ..ఏపీ కోసం దీక్ష చేద్దాం..రా..!!
Advertisement
Ads by CJ

ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలిచే వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు అయన ప్రత్యేక హోదా విషయం లో  ఏపీ సీఎం ని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు గనక ప్రత్యేక హోదా కోసం అమరణ దీక్ష చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని పద్మనాభం అంటున్నారు. ఆయన హైదరాబాద్ లో దాసరి నారాయణరావును కలిసిన అనంతరం మీడియా తో  మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎప్పుడూ దీక్షలు ధర్నాలతో హడావిడి చేసే ముద్రగడ.... సీఎం గారు చేసే దీక్షలో  చోటిస్తే  తానూ ఆయనతో పాటు దీక్ష చేస్తానని చెబుతున్నాడు. ఈ దీక్ష కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని ఎటువంటి స్వార్థం లేదని స్పష్టం చేసాడు. తాను నిరాహార దీక్ష చేసి జైలు నుండి కాపు నేతలను విడుపించుకున్నట్లు.... ఇప్పుడు ఏపీ సీఎం గనక అలాగే దీక్ష చేపడితే ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అనేది ఆయన ఉద్దేశ్యం కాబోలు. అందుకే ఇలాంటి సలహాలు పడేస్తున్నాడు. ఇక పొతే ఈ దీక్ష చేసి కాపు ఉద్యమాన్ని నిర్లక్ష్యం చెయ్యనని కాపుల కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు . అయితే పనిలో పనిగా అయన కాపు ఉద్యమం గురించి గుర్తు చేశారు. కాపుల కోసం సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతె మళ్ళీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం కావాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 11న రాజమండ్రిలో కాపు సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ