Advertisementt

గ్యారేజ్ పై ఈ గందరగోళం ఏమిటో?

Mon 29th Aug 2016 07:04 PM
janatha garage,suspense on janatha garage release,janatha garage re shoot,jr ntr,koratala siva  గ్యారేజ్ పై ఈ గందరగోళం ఏమిటో?
గ్యారేజ్ పై ఈ గందరగోళం ఏమిటో?
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేస్తున్నారనేది ఈ న్యూస్. అయితే ఈ న్యూస్ విన్న ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఇక సినిమా రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న సమయం లో ఇలాంటి వార్తలు వెలువడడంతో కొంచెం షాక్ అవుతున్నారు సినీప్రేమికులు. మరి సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.... సెన్సార్ వాళ్ళు పెట్టిన కండీషన్స్ వల్లే రీషూట్ చేస్తున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి వుంది. అయితే ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు 'జనతా గ్యారేజ్' మూవీ మేకర్స్. అసలు ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని కేవలం ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్ కార్యక్రమాలే మిగిలి ఉన్నాయని అంటున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలలో భాగం గా ఇందులో నటించిన నటీనటులతో ఇంటర్వ్యూ లు ఇప్పించడానికి షూటింగ్ జరుపుతున్నామని... అంటున్నారు. మరి ఇదే గనక నిజమైతే ఓవర్సీస్ కి చేరాల్సిన 'జనతా గ్యారేజ్' ప్రింట్స్ ఇప్పటి వరకు చేరలేదని.... ఇంకా సినిమా విడుదలకు 2 రోజులు మాత్రమే టైం ఉండడంతో ఈ గందరగోళ పరిస్థితులు ఏమిటో అని ఎన్టీఆర్ ఫాన్స్ వాపోతున్నారు. మరి సక్రమంగా ఈ చిత్రం సెప్టెంబర్ 1 న విడుదలవుతుందని ఫాన్స్.. ఇంకా సినీప్రేమికులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ