కొందరికీ అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శనిలా ఉంటుంది వ్యవహారం. కొందరికి అదృష్టం పట్టుకొని మాంచి ఊపు మీదకు వెళ్తుంటే మరికొందరిని మాత్రం దురదృష్టం పట్టుకొని వెంటాడుతూ ఉంటుంది. ఇక సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరిపై ఆటోమేటిగ్గా ఐరన్‌లెగ్ ఇమేజ్ వస్తుంది. కాగా దీనికి ఉదాహరణగా ముద్దుగుమ్మ పూజాహెగ్డేను చెప్పవచ్చు. ఆమె నటిస్తున్న తొలిసినిమా సమయంలోనే ఆమెకు స్టార్‌హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది. కానీ నాగచైతన్యతో చేసిన ఒక లైలాకోసం, వరుణ్‌తేజ్ హీరోగా చేసిన ముకుంద చిత్రాలు రెండు డిజాస్టర్స్‌గా నిలిచే సరికి టాలీవుడ్‌లో తర్వాత ఎవ్వరు ఆమెను తీసుకునే సాహసం చేయలేకపోయారు. ఇక ఉన్నట్లుండి ఆమెకు హృతిక్‌రోషన్ చేస్తున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రం మొహంజదారో లో అవకాశం వచ్చింది.ఈ చిత్రంపై పూజా హెగ్డే ఆకాశాన్నంటే నమ్మకం పెట్టుకుంది. సినీ విశ్లేషకులు కూడా ఈ చిత్రం హిట్టయితే పూజా హెడ్గే స్టార్‌హీరోయిన్ అవుతుందని జోస్యం చెప్పారు. కానీ ఈ చిత్రం కూడా బాలీవుడ్‌లో ఘోరంగా ఫ్లాపయింది. దీంతో బాలీవుడ్‌లో కూడా ప్రస్తుతానికి ఆమెను పక్కనపెట్టారు. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లొ శనిలా తయారై ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాకపోయే సరికి దిగాలు పడిపోయింది.