దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి1 లో కట్టప్ప బాహుబలిని వెనక నుంచి పొడిచి అనుమానపు అంశానికి సస్పెన్స్‌లో పెట్టాడు రాజమౌళి. ఇంతకీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే విషయంలో ప్రేక్షకులకే కాక దర్శకుడు రాజమౌళికి కూడా క్లారిటీ లేదని సమాచారం. కట్టప్ప బాహుబలిని పొడిచే సన్నివేశం సెకండ్‌పార్ట్ క్లైమాక్స్‌లో వస్తుందని తెలుస్తోంది. అందుకే కటప్ప, బాహుబలిని ఎందుకు పొడిచాడు? అనే విషయంలో ఆయన నాలుగు వేర్వేరు క్లైమాక్స్‌లను తీస్తున్నాడు. దీనివల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుందని తెలిసినప్పటికీ రాజమౌళి మాత్రం కట్టప్ప బాహుబలిని పొడిచినందుకు నాలుగు కారణాలను చూపిస్తూ నాలుగు వెర్షన్స్‌కి తెరకెక్కిస్తున్నాడు. దీనిలో బాగా కన్విన్సింగ్‌గా ఉండే వెర్షన్‌ను ఎడిటింగ్ సమయంలో ఫైనల్ చేయాలని రాజమౌళి ఆలోచనగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ప్రేక్షకులను సరైన రీజనింగ్‌తో మెప్పిస్తేనే ఈ చిత్రానికి నిండుదనం వస్తుంది. మరి దేశ విదేశాల్లో కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి అందరినీ మెప్పించేలా ఈ అంశానికి సరైన క్లారిటీ ఇవ్వడానికి రాజమౌళి నానా టెన్షన్ పడుతున్నాడు.