Advertisementt

రజనీకి అల్లుడు రాయభారం!

Sun 28th Aug 2016 09:21 PM
rajinikanth,dhanush,rajini next movie,dhanush recommendation,gautham menon,robo 2.0 movie,kabali movie  రజనీకి అల్లుడు రాయభారం!
రజనీకి అల్లుడు రాయభారం!
Advertisement
Ads by CJ

సాధారణంగా సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటే మూడేళ్లకు ఒకటి మాత్రమే వస్తుందని రజనీతో పాటు ఆయన దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు, అభిమానులు ఫిక్సయిపోయరు. కానీ విచిత్రంగా ఈసారి రజనీ తన దూకుడు పెంచాడు. 'కబాలి' చేసి అమెరికాలో ఆరోగ్యం పొంది ఇక్కడకు వచ్చిన వెంటనే శంకర్‌ 'రోబో 2.0'లో బిజీ అయిపోయాడు. ఈ చిత్రం ఇంకా సెట్స్‌పై ఉండగానే తన తదుపరి చిత్రం విషయంలో కూడా రజనీ ఓ క్లారిటీకి వచ్చాడనే ప్రచారం జరుగుతోంది. కాగా తమిళ, తెలుగు భాషల్లో అందరికీ సుపరిచితుడైన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌. ఇప్పుడు ఆయన రజనీ అల్లుడు ధనుష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ సందర్బంగా తాను రజనీ కోసం తయారు చేసుకున్న ఓ స్టోరీలైన్‌ను దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ధనుష్‌కి వినిపించాడట. దీంతో ఈ పాయింట్‌ ధనుష్‌కి బాగా నచ్చడంతో గౌతమ్‌ని తన మామ దగ్గరకు రికమెండ్‌ చేశాడట ధనుష్‌. దీంతో రజనీ అపాయింట్‌మెంట్‌ను ధనుష్‌ గౌతమ్‌కి ఇప్పించడం, రజనీకి కూడా గౌతమ్‌ చెప్పిన పాయింట్‌ బాగా నచ్చడంతో రజనీ తదుపరి చిత్రం గౌతమ్‌దేనని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ధనుష్‌ చిత్రం పూర్తయిన వెంటనే రజనీ కోసం తయారు చేసుకున్న పాయింట్‌కు పూర్తి స్క్రిప్ట్‌ తయారుచేయడంలో గౌతమ్‌ బిజీ కానున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ