Advertisementt

హమ్మనీ...అఖిల్ ఆమెతో దొరికాడు!

Sun 28th Aug 2016 02:38 PM
samantha,naga chaitanya,akhil,shriya bhoopal,akhil with shriya bhoopal  హమ్మనీ...అఖిల్ ఆమెతో దొరికాడు!
హమ్మనీ...అఖిల్ ఆమెతో దొరికాడు!
Advertisement
Ads by CJ

నాగచైతన్య - సమంత ల పెళ్లి త్వరలో జరుగుతుందని అంటున్నారు. దీనికి నాగార్జున సైడ్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. ఇక తర్వాత నాగ చైతన్య - సమంతలు ప్రేమ పక్షుల్లా విహరించిన సంగతి విదితమే. అక్కడక్కడా షాపింగ్ చేస్తూ వీరిద్దరూ కెమెరాలకు చాలా సార్లు దొరికిన విషయమూ తెలిసిందే. అయితే నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా ప్రేమలో పడ్డాడని.... అఖిల్ పెళ్లి, నాగ చైతన్యల పెళ్లి నాగార్జున దగ్గరుండి జరిపిస్తాడని మీడియా లో వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అఖిల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ ని లవ్ చేసిన సంగతి మీడియానే బయట పెట్టింది. కాని వీరిద్దరూ కలిసి ఎక్కడా మీడియా కి దొరకకుండా జాగ్రత్త పడ్డారు. ఇక సమంత అప్పుడప్పుడు ట్వీట్స్ తో పెళ్లి గురించి ఇండైరెక్టుగా మీడియా కి లీక్ చేస్తూ ఉండేది. కానీ ఈ పెళ్లిళ్ల సంగతి గత కొంతకాలం గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఎక్కడా పెళ్లి టాపిక్ తీసుకురాకుండా సమంత, చైతు, అఖిల్ లు జాగ్రత్త పడుతున్నారు. దీనికంతటికి కారణం నాగార్జునే అని అంటున్నారు. ఈ విషయాలేమి మీడియా కి లీక్ చెయ్యొద్దని వీరికి గట్టిగ్గా వార్నింగ్ ఇచ్చాడని అన్నారు. అయితే ఒకప్పుడు నాగ చైతన్య, సమంత లు దొరికినట్టు అఖిల్ కూడా ప్రేయసి తో  పాటు మీడియా కి దొరికి పోయాడు. వీరిద్దరూ ఒక ప్రవేట్ ఫంక్షన్ లో మీడియా కి దొరికి పోయారు. వీరిద్దరూ జంటగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ