యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అంటేనే ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు. ఎప్పుడు అవకాశం వస్తుందా ఆ సినిమా గురించి గానీ, హీరోగారి గురించిగానీ మాట్లాడేద్దామా అంటూ ఆరాటపడుతుంటారు ఆ చిత్రంలోని కథానాయికలు. అలాంటింది నిత్య మీనన్ మాత్రం జనతా గ్యారేజ్ విషయంలో కాస్త అలిగినట్లుగా అగపడుతుంది. ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్‌లో ఛాన్స్ దక్కించుకున్న నిత్య, అంతే స్థాయిలో ఆ చిత్రంలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రనే పోషించింది. కానీ నిత్య కొంచం మనస్తాపానికి గురౌతుందంట ఈ మధ్య. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో తనకు స్థానం దక్కడం లేదని వాపోతుంది. అంతా ఈ సినిమాలో సమంతే హీరోయిన్ గా భావిస్తున్నారని, తనని క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చూస్తున్నారని మండిపడుతుందంట నిత్య. అందుకే పాపం జనతా గ్యారేజ్ సినిమా విషయంలో తాను నోరు మూసుకొనే ఉందామని డిసైడ్ అయిపోయినట్లు టాక్. కాగా 100 డేస్ ఆఫ్ లవ్ సినిమా కోసం టీవీ ఛానళ్ల చుట్టూతా తిరుగుతూ బిజీ బిజీగా ప్రమోషన్లు చేసుకుంటుంది నిత్య. సందర్భం కదా అని టివి యాంకర్ జనతా గ్యారేజ్ గురించి చెప్పండి అని అడిగితే ఇది ఆ సినిమా సందర్భం కాదు అన్నట్లు తప్పించుకు తిరుగుతుందని టాక్. కానీ విషయం ఏంటంటే జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించి నిత్యకు తగిన విలువ గౌరవాలు ఇవ్వడం లేదన్నది సమాచారం. నిత్యకు అసలే ఎమోషనల్ లెవల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ దిశగా చూస్తే ఈ సందర్భంలో మెత్తబడి వ్యవహారం నడుపుకుంటేనే మంచిది. అసలకే పెద్దహీరో సినిమా. ఏలాగైనా ముందు ముందు ఇబ్బందులు కొనితెచ్చికోకుండా ఉండాలంటే కూలై పోవడం ఉత్తమమన్నది పరిశ్రమ వర్గాల టాక్.