Advertisementt

బన్నీ రికార్డును ఎన్టీఆర్‌ బద్దలుకొట్టగలడా?

Sat 27th Aug 2016 10:07 PM
allu arjun,bunny,janatha garage,malayalam,babubali  బన్నీ రికార్డును ఎన్టీఆర్‌ బద్దలుకొట్టగలడా?
బన్నీ రికార్డును ఎన్టీఆర్‌ బద్దలుకొట్టగలడా?
Advertisement
Ads by CJ

మలయాళంలో స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మలయాళంలో టాలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రాలలో టాప్‌10 కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మొదటిస్దానం 'బాహుబలి' పేరు మీద ఉంది. ఈ చిత్రం మలయాళంలో ఏకంగా 14కోట్లు వసూలుచేసి మొదటి స్దానంలో ఉంది. ఇక టాప్‌ 10లోని మిగిలిన 9చిత్రాలు బన్నీ నటించిన చిత్రాలే కావడం గమనార్హం. కాగా ఇప్పుడు ఎన్టీఆర్‌,సమంతలతో పాటు మలయళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో పాటు మలయాళంలో గుర్తింపు పొందిన నిత్యామీనన్‌, ఉన్ని ముకుందన్‌ తదితరులు నటిస్తున్న 'జనతాగ్యారేజ్‌' చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో మలయాళంలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మలయాళ డబ్బింగ్‌ రైట్స్‌ ఏకంగా 8కోట్లకు అమ్ముడయ్యాయి. 'బాహుబలి' తర్వాత మలయాళంలో ఇంత రేటు పలికిన టాలీవుడ్‌ చిత్రంగా ఈ 'జనతాగ్యారేజ్‌' ఇప్పటికే బిజినెస్‌లో సంచలనం సృష్టించింది. మరి ఈ చిత్రం హిట్టయ్యి.. బన్నీ రికార్డులన్నీ బద్దలు కొట్టి 'బాహుబలి'ని కూడా సవాల్‌ చేసే చిత్రంగా నిలుస్తుందా? లేదా?అన్నది మరి కొన్నిరోజుల్లో తేలిపోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ