చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కేకపెట్టించిన 'పెళ్ళిచూపులు' చిత్రంలో నటించిన నటీనటులకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో హీరోగా వైవిధ్యభరితమైన, రియలిస్టిక్ నటనతో విజయ్ దేవరకొండ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ హీరో చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి 'ద్వారక'. తన మొదటి రెండు చిత్రాలలోనూ పెద్దగా డ్యాన్స్ చేసే అవకాశం, స్టెప్పులతో ఇరగదీసే అవసరం ఈ హీరోకు రాలేదు. కానీ 'ద్వారకా' చిత్రంలో మాత్రం ఈ హీరోలోని మరో యాంగిల్ అయిన డ్యాన్స్‌లు ఇరగదీశాడంటున్నాయి యూనిట్ వర్గాలు. మొత్తానికి ఈ మూడో చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ తనలోని సరికొత్త టాలెంట్‌ను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ డ్యాన్స్‌లు ఆయనకు ఎంతగా కలిసొస్తాయో? అయనలోని మరో టాలెంట్‌ను ఎంతవరకు ఇవి బయటపెడుతాయో వేచిచూడాల్సివుంది.