Advertisementt

ఈ మ్యాడ్ గర్ల్స్ ఒప్పందం ఏంటి?

Sat 27th Aug 2016 04:07 PM
upasna kamineni,sneha reddy,3 mad girls,namrata shirodkar,birkin pact  ఈ మ్యాడ్ గర్ల్స్ ఒప్పందం ఏంటి?
ఈ మ్యాడ్ గర్ల్స్ ఒప్పందం ఏంటి?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినోజు సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో పర్సనల్ గా ఇచ్చిన పార్టీలో  టాలీవుడ్ నుండి కొంతమంది సెలబ్రిటీస్ హాజరయిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి ఎందుకో తెలీదు గాని కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం లభించింది. ఈ పార్టీకి హాజరైన వారిలో మహేష్ బాబు, రవితేజ, శరత్ మరార్ లాంటి మరికొందరు స్టార్స్, ఇండస్ట్రీకి చెందిన బిగ్ షాట్స్ హాజరయ్యారు. అంతే కాకుండా మహేష్ తన భార్య నమ్రతతో హాజరవగా... అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో హాజరయ్యాడు. కానీ రామ్ చరణ్ మాత్రం తన భార్యతో కలిసి రాలేదు. చిరు 150 సినిమాని డైరెక్ట్ చేస్తున్న వి.వి.వినాయక్ తో కలిసి చిరు పర్సనల్ పార్టీ కి హాజరయ్యాడు. కానీ ఉపాసన మాత్రం అంతకుముందే పార్టీ లో జాయిన్ అయినట్లు ఉంది అందుకే మీడియా క్లిక్ కి దొరకలేదు. కానీ ఆమె కూడా పార్టీ కి హాజరైంది అనడానికి రుజువుగా సోషల్ మీడియా లో ఓ పిక్ రివీల్ అయ్యింది. అసలు  ఇప్పటి వరకు ఈ పార్టీకి సంబంధించిన ఇన్ సైడ్ పిక్స్ బయటకు రాలేదు. అయితే తాజాగా పార్టీ ఇన్ సైడ్ ఫోటో ఒకటి మహేష్ బాబు భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.  రామ్ చరణ్ భార్య ఉపాసన, బన్నీ భార్య స్నేహారెడ్డితో కలిసి దిగిన ఈ ఫోటోకు మ్యాడ్ గర్ల్స్ ఒప్పందం అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఇదే ఫోటోను ఉపాసన కూడా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. అసలు లోపల ఏ రేంజ్ లో పార్టీ జరిగిందో ఎవ్వరికి తెలీదు. దాని గురుంచే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఇక ఈ పిక్ చూసిన తర్వాత ఆహా పార్టీ ఇలా ఉందా అనుకోవడం గమనార్హం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ