ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా, మోహన్‌లాల్ కీలకపాత్రలో సమంత, నిత్యామీనన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతాగ్యారేజ్' చిత్రం సెప్టెంబర్1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఎన్టీఆర్, కొరటాలను చూసి తెలుగులో..., మోహన్‌లాల్, నిత్యామీనన్, ఉన్నిముకుందన్‌ను చూసి మలయాళ మార్కెట్‌లో ఈ చిత్రానికి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని ఒరిస్సాతో పాటు నార్త్‌ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయని సమాచారం. ఈ హక్కులను రూ.65 లక్షలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ రేటుకి ఆ హక్కులు అమ్ముడుకావడం ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ ఎమోంట్ అంటున్నారు. కాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మైత్రి మూవీస్ అధినేతలు భారీగా మొదలుపెట్టారు. దాదాపు మరో వారం పాటు ఈ చిత్ర పబ్లిసిటీ విషయంలో హోరెత్తించేలా ప్లాన్ చేశారు నిర్మాతలు. మరి ఈ చిత్రం ఎన్టీఆర్, కొరటాల శివలకు హ్యాట్రిక్‌ను అందిస్తుందేమో వేచి చూడాల్సివుంది.