పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోడీపై సంచలనం రేపేలా వ్యాఖ్యలు చేసింది. సహజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పశ్చిమ బెంగాల్ కు కేటాయించిన నిధులకోసం తాము చాలా కాలం నుంచి అడుగుతున్నామని, కేంద్రం మాత్రం ఆ నిధులకు సంబంధించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మమతా మండిపడింది. ఈ విషయంపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని, మా రాష్ట్రానికి రావాల్సిన నిధులను మోడి సూట్స్ కొనడానికి ఖర్చు పెట్టారా అన్న ప్రశ్నను ఆమె లెవనెత్తింది. లేకపోతే తమకు రావలసిన నిధులు అడుగుతుంటే లేవని సమాధానం చెప్పడం వెనుక ఉన్న మతలబు ఏంటో చెప్పాలని మమతా బెనర్జీ వివరించింది.
ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తుందో అంతుపట్టడం లేదని ఆమె సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. ఇంకా మోడీ సూట్లు కుట్టించుకోవడానికి మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించారా? అని కూడా సందేహాన్ని వెలిబుచ్చింది. ఇంకా మమతా స్పందిస్తూ… పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం మానుకోక పోతే మూడు నెలల్లో తాము ఢిల్లీ వీథుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.