Advertisementt

లీకైతే మాత్రం..మరీ ఇలా ప్రచారమా..!!

Sat 27th Aug 2016 02:02 PM
janatha garage,jr ntr,janatha garage story leaked,koratala siva,mythri movie makers  లీకైతే మాత్రం..మరీ ఇలా ప్రచారమా..!!
లీకైతే మాత్రం..మరీ ఇలా ప్రచారమా..!!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - కొరటాల శివ  కాంబినేషన్ లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1 న రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఈ సినిమాకి సంబంధించి... హై రేంజ్ లో బిజినెస్ ఎప్పుడో జరిగింది. మరి తీసిన రెండు సినిమాల హిట్స్ తో కొరటాల పై వున్న నమ్మకం, వరస హిట్స్ తో జోరుగా వున్న జూనియర్ ఎన్టీఆర్ లు ఈ రేంజ్ బిజినెస్ కి కారణం గా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ కూడా సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశాయి. అయితే సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై రోజుకో వార్త షికారు చేస్తుంది. ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యిందని మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఇన్ని సీన్లు వున్నాయి, స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా ఎండ్ అవుతుంది అంటూ..విడుదలకు ముందే సీన్లు సీన్లుగా వివరిస్తూ మరి మీడియాలో ఈ మూవీ స్టోరీ లీక్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఇంకా 6 రోజుల్లో విడుదలవబోయే ఈ సినిమా గురుంచి ఇలాంటి న్యూస్ లు హల్ చల్ చేస్తే పాపం సినిమా తీసిన నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుంది. పోనీ సినిమా లీక్ అయ్యిందే అనుకోండి. ఇలా మీడియా నే దానిని ప్రచారం చేసేస్తే పాపం చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏమిటి. ఇక ఈ లీకైన సీన్స్ ని చూశారంటే సినిమా మీద వున్న కాస్త ఇంట్రెస్ట్ పోయి సినిమా చూసే అవకాశాలు తక్కువై పోతాయి. మరి అంత కష్టపడి డైరెక్ట్ చేసిన సినిమా...ఇంకా ఎన్నో కోట్లు పెట్టి నిర్మించిన నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒక్క 'జనతా గ్యారేజ్' అనే కాదు..ఏ సినిమా అయినా..ఇలా ముందే లీక్ చేసేస్తే..ఎంతో శ్రమ కోర్చి..సినిమాలు తీసే వారు ఎంతగా నష్టపోతారో..సినిమాలపైనే బ్రతుకుతూ, ఇలాంటివి ఖండించాల్సిన మీడియా గమనిస్తే మంచిది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ