Advertisementt

'ధృవ' కోసం ఏం, ఎలా చేస్తారో..?

Sat 27th Aug 2016 08:13 AM
dhruva,dhruva movie promotion,ram charan,mega power star,allu aravind,surendar reddy  'ధృవ' కోసం ఏం, ఎలా చేస్తారో..?
'ధృవ' కోసం ఏం, ఎలా చేస్తారో..?
Advertisement
Ads by CJ

సినిమా ప్రచారంలో కొత్తపుంతలు తొక్కించడం, తాను నిర్మిస్తున్న చిత్రాలను డిఫరెంట్‌గా ప్రమోట్‌ చేయడంలో గీతాఆర్ట్స్‌ అధినేత అల్లుఅరవింద్‌ది డిఫరెంట్‌ స్ట్రాటర్జీ. ప్రస్తుతం ఆయన రామచరణ్‌ హీరోగా తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌గా 'ధృవ' చిత్రం నిర్మిస్తున్నాడు. ఈచిత్రం షూటింగ్‌ వేగంగా జరుపుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్‌7న చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్‌ భావిస్తోంది. ఇదో కొత్త తరహా సబ్జెక్ట్‌ కావడంతో ఈ చిత్రం ప్రమోషన్‌ను కూడా డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా అల్లుఅరవింద్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఈ విషయంలో ఆయన హీరో రామ్‌చరణ్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డిలతో కూర్చొని ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలపై ఆల్‌రెడీ ఓ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. మొత్తానికి అల్లుఅరవింద్‌ 'ధృవ' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నాడని అంటున్నారు. మరి అల్లుఅరవింద్‌ ఈ చిత్రాన్ని ఎలా ప్రమోట్‌ చేయనున్నాడనే విషయం మాత్రం కొన్నిరోజులాగితే కానీ తెలియదు అంటున్నాయి యూనిట్‌ వర్గాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ