Advertisement

వినోద్ హత్య తో జనసేన లో కదలిక..!

Fri 26th Aug 2016 08:41 PM
janasena,pawan kalyan,tirupati,public meeting,pawan kalyan janasena public meet,vinod murder  వినోద్ హత్య తో జనసేన లో కదలిక..!
వినోద్ హత్య తో జనసేన లో కదలిక..!
Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాజం పట్ల అప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. అదే విధంగా హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్ గురువారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడే గెస్ట్ హౌస్ లో పలువురు అభిమానులు, నేతలతో ఆయన చర్చలు జరిపారు. సహజంగా పవన్ కళ్యాణ్ ఎవరి ఆలోచనా విధానానికి అందరు. ఆయనకొచ్చిన హృదయ స్పందనతో ఎప్పుడు ఏం అనుకుంటారో అది ఏమైనా, ఎలాంటిదైనా అనుకున్నప్పుడే చేసేస్తారు. తిరుపతిలో పవన్ కళ్యాన్ కార్యక్రమం పరామర్శించడం వరకే అని అందరూ భావించారు. కానీ పవన్ నిన్ననే తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రంతా గెస్ట్ హౌస్ లో చర్చలు జరిపిన పవన్ ఉదయాన్నే మరోమారు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక్కడే ఉంది ట్విస్ట్.... పవన్ ఉదయం శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ బయలుదేరుతారని అందరూ అనుకున్న మాట వాస్తవం. కానీ ఎవరి ఆలోచనకూ అందని పవన్.... శనివారం తిరుపతిలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేయాలంటూ నిర్ణయం కూడా తీసేసుకున్నారంట. అందుకే దీనికి సంబంధించి అభిమానులు, నేతలతో పలు దఫాలుగా చర్చోపచర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. 

తిరుపతిలో ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీ మార్గదర్శకంగా ఈ మధ్య ఎక్కువగా తిరుపతి లక్ష్యంగా పవన్ కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలనుకున్నట్లు సమాచారం అందుతుంది. కాగా జనసేన ప్రస్థానం పేరుతో రేపు జరగబోయే సభకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ ఈ సభలో పవన్ రాష్ట్రంలో  జరుగుతున్న పలు రాజకీయ, సామాజిక పరిస్థితులపై ప్రసంగించనున్నారని తెలుస్తోంది. కాగా ఉన్నట్టుండి పవన్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుండడంతో రాజకీయనేతలకు చమటలు పడుతున్నాయి. ఏపీలో నెలకొన్న ఇప్పటి ఈ పరిస్థితుల్లో పవన్ ఏం మాట్లాడబోతున్నారోనన్న టెంక్షన్ రాజకీయనేతలను వేధిస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, తెదేపా-జనసేన సంబంధాలు వంటి పలు అంశాల్లో ఏ విషయంపై మాట్లాడతారోనని నేతల్లో ఒకరకమైన ఆందోళన నెలకొంది. కానీ పవన్ కళ్యాన్ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో జనసేన కార్యకర్తల్లో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement