కాపు నేత ముద్రగడ మళ్ళీ హైలెట్ అవుతున్నారా అంటే.... అవుననే సమాధానం వస్తుంది. కాపుల రిజర్వేషన్ కోసం పోరాడి ప్రభుత్వం నుండి హామీ తీసుకున్న ముద్రగడ కొంత కాలం నుండి సైలెంట్ గా ఉంటున్నాడు. మొన్నామధ్య ఆయన తుని ఘటనలో అరెస్ట్ అయిన కాపు నేతల కోసం చాల రోజులు నిరాహార దీక్ష చేసి వారిని విడిపించుకుని కాపు నేతగా సంచలనం సృష్టించారు. అప్పటి నుండి కొంచెం సైలెంట్ గా వున్న ముద్రగడ మళ్ళీ ఇంకోసారి వార్తల్లోకొచ్చారు. ఆయన ఏపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ అంశం కోసం ఏర్పాటు చేసిన మంజునాథ కమిటీ ఏమి పని చెయ్యడం లేదని.... తన రిపోర్టును సమర్పించడం లో చాలా సమయం తీసుకోవడం వల్ల ముద్రగడ పద్మనాభం మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయనున్నారని సమాచారం. అయితే మంజునాథ కమిటీ తన నివేదికని ఆగష్టు 29 కల్లా ప్రభుత్వానికి సమర్పించవలసి వుంది. అయితే ఆ తేదీ దగ్గర పడడం తో ముద్రగడ మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే ప్రభుత్వమే త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని లేకపోతె మళ్ళీ నిరసనలు, దీక్షలు తప్పవని ముద్రగడ ప్రభుత్వ్వాన్ని హెచ్చరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఐతే ముద్రగడ ఇప్పటికే కాపు నేతలతో సమావేశమయ్యారని..... జరగబోయే పరిణామాలపై ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అసలు ఇప్పటికే ప్రభుత్వానికి చాలా గడువు ఇచ్చామని ఇక జాప్యం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు కాపునేతలు.