Advertisementt

వినోద్‌ది అభిమానంతో జరిగిన హత్యేనా..!

Fri 26th Aug 2016 03:49 PM
vinod,tirupati,murder,pawan kalyan fan,mi story,vinoda murder,ntr fan  వినోద్‌ది అభిమానంతో జరిగిన హత్యేనా..!
వినోద్‌ది అభిమానంతో జరిగిన హత్యేనా..!
Advertisement
Ads by CJ

జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇటువంటి అనుమానాలే వస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌ అభిమాని అయిన వినోద్‌ని, యన్టీఆర్‌ అభిమాని కత్తితో పొడిచి చంపాడనే ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. అయితే ఇది నిజంగా అభిమానంతో జరిగిన హత్యేనా అని అనుమానం అడుగడుగునా కనిపిస్తుంది. అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకోవడం సహజం. కానీ చంపేంత, చచ్చిపోయేంత అభిమానం అంటే..అది హద్దులు మీరినట్లే. అయితే హత్యకు గురైన వినోద్‌ విషయంలో జరిగింది అభిమానం వల్ల జరిగిన హత్యలా కనిపించడం లేదు. యన్టీఆర్‌ ఫ్యాన్‌ అని చెబుతున్నారు..కానీ, దీని వెనుక ఏదో తెలియని విషయం ఉందనేది క్లియర్‌గా స్పష్టమవుతుంది. వినోద్‌ జనసేన పార్టీ తరుపున చురుకుగా వ్యవహరిస్తాడనే విషయంతో పాటు, వినోద్‌ తల్లి చెబుతున్న ప్రకారం ఇది పక్కా ప్లానింగ్‌ మర్డర్‌లా అనిపిస్తుంది. అవయువదానం కార్యక్రమాన్ని నా కొడుకు విజయవంతం చేయడం వలనో, లేక రాజకీయంగా నా కొడుకు ఎదుగుతాడనే కసితోనో..ఈ పని చేశారని వినోద్‌ తల్లి ఆరోపించడంతో వినోద్‌ హత్య కొత్త మలుపు తిరిగింది. అభిమానం అనే ముసుగు కప్పి..వెనుక పెద్ద స్కెచ్‌ వేసి మరీ వినోద్‌ని చంపారనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఏ విషయం పోలీసులు త్వరలోనే చేధించి, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుందాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ