మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు ఈమద్యకాలంలో ఏమీ కలిసిరావడం లేదు. ప్రస్తుతం ఆయన కెరీర్ గాడితప్పింది. ప్రస్తుతం చరణ్ తమిళ 'తనివరువన్' రీమేక్ 'ధృవ'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తుండగా అల్లుఅరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, తన కెరీర్‌లో కేవలం రెండో చిత్రమైన 'మగధీర'తో రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత చరణ్ గీతాఆర్ట్స్‌లో నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం దీపావళికి పోస్ట్‌పోన్ అయింది అనే ప్రచారాన్ని యూనిట్ ఖండించి ఎట్టిపరిస్దితుల్లోనూ ఈ చిత్రాన్ని దసరా కానుకగానే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధంగా దసరాకు రావడం రామ్‌చరణ్‌కు ఇది మూడోసారి. గతంలో ఆయన నటించిన 'గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ' చిత్రాలు కూడా దసరాకి విడుదలై సరైన సక్సెస్‌ను తేలేకపోయాయి. దీంతో దసరాకు రాకుండా దీపావళికి వస్తాడేమో అని కొందరు భావించారు. కానీ చరణ్ మాత్రం ఎట్టిపరిస్దితుల్లోనూ దసరాకే రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాగా ఈచిత్రం టాకీపార్ట్ సెప్టెంబర్ 5తో పూర్తవుతుంది. అదే నెలలో పాటల షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్ వంటివి నిర్వహించి దసరా కానుకగా అక్టోబర్ 7నే విడుదల చేయనుండటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.