దీపికా పదుకొనే.. బాలీవుడ్ లో తను నటిస్తే చాలు.. సినిమాలు సూపర్‌హిట్ అవుతాయనే పేరొందిన ఈ కన్నడ కస్తూరి ఇటీవల వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేజిక్కించుకొని ప్రపంచ సినిమా ప్రేమికులందరికీ దగ్గర కావడంతో పాటు ఫోర్బ్స్ జాబితాలో తన పేరును లిఖించుకొంది. ఏడాదికి సుమారుగా 68 కోట్లకు పైగా సంపాదిస్తూ ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా మారి ప్రపంచ సెలబ్రిటీల సరసన తన పేరును లిఖించుకొని సంచలనం సృష్టించింది. ఇక ఆమె ఇప్పటికే ఇండియన్ స్క్రీన్‌పై కూడా నెంబర్‌వన్ స్దానం సొంతం చేసుకుంది. ఆమె బాలీవుడ్‌కి ఇంత గ్యాప్ ఇచ్చినా ఆమె స్దానాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ భర్తీ చేయలేకపోతున్నారంటే దీపికా పదుకొనే హవా ఏ స్దాయిలో ఆకట్టుకుందో వేరుగా చెప్పనవసరం లేదు. మొత్తానికి ఫోర్బ్స్ జాబితా ద్వారా దీపికా ఓ సంచలనమే సృష్టించిందని, ఆమెకు మరిన్ని హాలీవుడ్ ఛాన్స్‌లు వస్తే ప్రపంచ సినీ పటంలోనే ఆమె తన పేరును శాశ్వతంగా లిఖించడం ఖాయమంటున్నారు.