హాలీవుడ్ జేమ్స్‌బాండ్ సిరీస్ తరహాలో బాలీవుడ్ 'ధూమ్' సిరీస్ కూడా సంచలనాలను క్రియేట్ చేస్తూనే ఉంది. త్వరలో 'ధూమ్' సిరీస్‌లో నాలుగో భాగం 2017 జనవరిలో మొదలుకానుంది. ఈసారి ఈ దొంగల జాబితాలో షారుఖ్ వచ్చి చేరాడు. ధూమ్4లో ఆయనే ప్రధాన పాత్ర పోషించనున్నాడు. 'డాన్, బాజీఘర్' చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన 'ఫ్యాన్' చిత్రంలో కూడా షారుక్ విలన్ ఛాయలున్న పాత్రలను చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తూ వచ్చిన అబిషేక్ బచ్చన్ స్దానంలో ఈ సారి ఆ పాత్రలో రణవీర్‌సింగ్ నటించనున్నాడని సమాచారం. మొత్తానికి 'ధూమ్4' చిత్రం షారుఖ్, రణవీర్‌సింగ్‌ల చేరికతో మరింతగా శోభతెచ్చుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.