50కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే 60కోట్లు వసూలు చేసే పెద్ద స్టార్ చిత్రాల కంటే.. కోటి, రెండు కోట్లలో సినిమా తీసి అది 15కోట్లు వసూలు చేయడం అంటే మాటలు కాదు. అందుకే చిన్నసినిమాలు హిట్టయితేనే పరిశ్రమ బాగా ఉంటుందని అంటూ ఉంటారు అనుభవజ్ఞులు. అలాంటి కోవలోకి వచ్చే సినిమాలకు ఉదాహరణ.. 'క్షణం, కుమారి 21 ఎఫ్, బిచ్చగాడు, పెళ్ళిచూపులు' వంటి చిత్రాలే. ఇటీవల కాలంలో కేవలం రెండు కోట్ల బడ్జెట్‌లోపు తెరకెక్కించిన 'పెళ్ళిచూపులు' చిత్రం ఏకంగా 15కోట్లు కొల్లగొడుతోంది. ఇక అల్లు శిరీష్ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రానికి కూడా చాలా చోట్ల బ్రేకీవన్ అయి లాభాలు సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఇప్పుడు మన స్టార్ దర్శక నిర్మాతలు తామే చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ భారీ లాభాలు కొల్లగొట్టే ప్రణాళిలు రచిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇదే తరహాలో కొనసాగితే తెలుగు సినీ పరిశ్రమకు మరలా మంచిరోజులు వచ్చాయనే చెప్పాలి.