Advertisement

కొరటాలను క్రాస్ చేసిన మెగా ఎక్స్‌ప్రెస్!

Thu 25th Aug 2016 06:33 PM
koratala siva,mega express,ram charan,merlapaka gandhi,young director,dhruva  కొరటాలను క్రాస్ చేసిన మెగా ఎక్స్‌ప్రెస్!
కొరటాలను క్రాస్ చేసిన మెగా ఎక్స్‌ప్రెస్!
Advertisement

రామ్ చరణ్, సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో 'ధృవ' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలయిన తర్వాత రామ్ చరణ్, సుకుమార్ తో ఒక సినిమాకి కమిట్ అయినా విషయమూ తెలిసిందే.  ఇక ఈ చిత్రాలు పూర్తయ్యాక రామ్ చరణ్, కొరటాల డైరెక్షన్ లో నటించాల్సి వుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది అంటున్నారు. సుకుమార్ తో చిత్రం కంప్లీట్ అయ్యాక కొరటాల కాంబినేషన్ లో నటించాలని అనుకున్న రామ్ చరణ్ ఇప్పుడు అతని డైరెక్షన్ కాదని ఒక యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరి కొరటాలను రామ్ చరణ్ ఎందుకు పక్కన పెట్టాడో అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ విషయమై ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది. ఈ వార్త సారాంశం ఏమిటంటే కొరటాల 'జనతా గ్యారేజ్' షూటింగ్ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ తో సినిమా డైరెక్ట్ చెయ్యాల్సి వుంది. అయితే రామ్ చరణ్ 'ధృవ' సినిమా అయ్యాక సుకుమార్ తో సినిమా చెయ్యాల్సి వుంది. ఇక ఎలాగూ రామ్ చరణ్, సుకుమార్ సినిమా కంప్లీట్ అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మహేష్ తో సినిమా చెయ్యడానికి కొరటాల ప్లాన్ వేశాడట. అందుకే ఒక మంచి కథతో మహేష్ ని కలిసాడని మహేష్ ఈ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.... ఇక విషయం తెలిసిన రామ్ చరణ్ కి కోపం వచ్చి కొరటాల ను సైడ్ చేసాడని టాక్ నడుస్తుంది. మరి ఇది నిజమో కాదో కొరటాలకే తెలియాలి. 

ఈ విషయమేమో గాని రామ్ చరణ్ అవకాశం ఇస్తున్న యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిట్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ అట. గాంధీ చెప్పిన స్టోరీ లైన్ రామ్ చరణ్ తెగ నచ్చేసిందని... అందుకే అతనితో సినిమా తియ్యడానికి ఉత్సాహం చూపుతున్నాడని సమాచారం. అయితే దీనికి సంబందించిన స్క్రిప్ట్ డెవలప్ చెయ్యమని గాంధీ కి రామ్ చరణ్ చెప్పాడని.... ఇక స్క్రిప్ట్ వర్క్ పనిలో గాంధీ నిమగ్నమయ్యాడని సమాచారం. ఈసినిమాకి అప్పుడే టైటిల్ కూడా ఆలోచించారని అంటున్నారు.  ఎక్స్‌ప్రెస్ పేరు డైరెక్టర్ కి అచ్చొచ్చిన పేరు గనక ఈ సినిమాకి కూడా 'మెగా ఎక్స్‌ప్రెస్' అని పెట్టాలని ఆలోచిస్తున్నారట. మరి ఈ టైటిల్ పెట్టడానికి రామ్ చరణ్ ఒప్పుకుంటాడా లేదో చూడాలి. మొత్తానికి గాంధీకి అదృష్టం ఎక్స్‌ప్రెస్ రేంజ్ లో ఉందన్నమాట.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement