'జనతా గ్యారేజ్' విడుదల తేదీ ఒక రోజు ముందుకు జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేస్తామని నెలరోజుల క్రితమే ప్రకటించిన నిర్మాతలు అకస్మాత్తుగా ఒకటవ తేదీకి మార్చారు. ఇదేమి సెంటిమెంట్‌తో చేసింది కానేకాదు. ఎందుకంటే రెండవ తేదీన కొన్ని కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ రోజు ట్రేడ్ బంద్ అని అంటున్నారు. బంద్ జరిగిన పక్షంలో అదే రోజు సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు సైతం మూసేస్తారు. దీనివల్ల మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు రద్దవుతాయి. దాంతో ఓపనింగ్స్ మిస్సవుతాయి. అదే జరిగితే చాలా నష్టం తెచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఒకరోజు ముందే రిలీజ్ చేస్తే ఆశించిన ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో తేదీలో మార్పు చేసినట్టు యూనిట్ వర్గాలు అంటున్నాయి. రెండవ తేదీన బంద్ జరిగినా, జరగకున్నా నష్టం రాకుండా ఈ మార్పు చేశారన్నమాట.