Advertisementt

సినిమా ఆడకపోయినా.. క్రేజ్‌ తగ్గలేదు!

Wed 24th Aug 2016 08:47 PM
kabali,craze,pa ranjith,kabali movie,rajinikanth,pa ranjith craze  సినిమా ఆడకపోయినా.. క్రేజ్‌ తగ్గలేదు!
సినిమా ఆడకపోయినా.. క్రేజ్‌ తగ్గలేదు!
Advertisement
Ads by CJ

'అట్టకత్తి, మద్రాస్‌' వంటి రెండు సక్సెస్‌పుల్‌ చిత్రాలతో రియలిస్టిక్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుడు రంజిత్‌పా. కాగా ఆయన ఇటీవలే రజనీకాంత్‌ హీరోగా 'కబాలి' చిత్రం తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో ఫర్వాలేదనిపించుకుంది. తెలుగులో మాత్రం ఈ చిత్రానికి అట్టర్‌ఫ్లాప్‌ టాక్ వచ్చింది. మిగిలిన భాషల్లో ఫర్వాలేదనిపించుకోవడమే కాదు...బాక్సాఫీస్‌ వద్ద కూడా బాగా జోరు చూపించి కమర్షియల్‌గా కూడా ఓకే అనిపించుకుంది. కాగా 'కబాలి' ఎఫెక్ట్‌ వల్ల దర్శకుడు రంజిత్‌పాపై ఉన్న క్రేజ్‌ కూడా తగ్గలేదు. ఆయన దర్శకత్వంలో నటించడానికి స్టార్‌ హీరోలైన విజయ్‌, సూర్యలు ఎదురుచూస్తున్నారు. రంజిత్‌ దర్శకత్వంలో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కాగా ప్రస్తుతం రంజిత్‌ పా ఓ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే బిజీలో ఉన్నాడు. అయితే స్క్రిప్ట్‌ పూర్తయ్యే దాకా ఈ చిత్రంలో ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయాన్ని చెప్పలేనని, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన తర్వాతే ఈ చిత్రంలో ఏ హీరో నటిస్తాడు? అనే విషయం ఆలోచిస్తానని దర్శకుడు రంజిత్‌ పా అంటున్నాడు. ఇలా 'కబాలి' ఎఫెక్ట్‌ ఆయన కెరీర్‌పై పడకపోవడానికి గల కారణాలను తమిళ మీడియా ఒక్కొక్కొరు ఒక్కో విధంగా ఎనలైజ్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ