Advertisementt

రామ్ చరణ్ రాఖీ స్పెషల్ ఇదే..!!

Wed 24th Aug 2016 08:27 PM
ram charan,rakhi,pawan kalyan daughter polena,pawan wife anna,ram charan rakhi special  రామ్ చరణ్ రాఖీ స్పెషల్ ఇదే..!!
రామ్ చరణ్ రాఖీ స్పెషల్ ఇదే..!!
Advertisement
Ads by CJ

రాఖీ అంటే అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ఈ రాఖీ రోజున ప్రతి అన్న.. తన చెల్లెలితో రాఖీ కట్టించుకుని ఆమెకి ఏదైనా కానుక ఇవ్వడం ఆచారం. సొంత చెల్లె కాకపోయినా పెదనాన్న కూతురో లేక బాబాయ్ కూతుర్లతో కూడా రాఖీలు కట్టించుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు..? ఇది తెలిసిన విషయమేగా అనుకుంటున్నారా.  అదేనండి సెలబ్రిటీస్ తమ చెల్లెళ్ళతో రాఖీలు కట్టించుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వున్నాడు. ఆయనకి ఇద్దరు సొంత సిస్టర్స్ వున్నారు. వారు సుష్మిత, శ్రీజలు. వారే కాకుండా నాగబాబు కూతురు నిహారిక, పవన్ కూతురు కూడా రామ్ చరణ్ కి రాఖీలు కట్టారు. రామ్ చరణ్ తన సొంత చెల్లెళ్లతోనే కాకుండా బాబాయ్ కూతుర్లతో కూడా రాఖీలు కట్టించుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది. ప్రతి ఏడు జరిగే తంతేగా అనుకుంటున్నారా.. ఇక్కడే ఉందండి అసలు సిసలైన స్పెషల్... పవన్ కూతురు పొలేనాతో రామ్ చరణ్ రాఖీ కట్టించుకోవడం. ఇప్పుడదే హాట్ టాపిక్ అయ్యింది. పవన్ మూడవ భార్య అన్నా తెలిసేవుంటుంది. పవన్ - అన్నాల ముద్దుల కూతురే పొలేనా. ఈ పొలేనాతో రామ్ చరణ్ రాఖీ కట్టించుకుని ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడట ఈ చిట్టి చెల్లెలికి. ఆ గిఫ్ట్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి రామ్ చరణ్ అన్నయ్యకి రాఖి కట్టిన పొలేనా తన అన్న అఖిరాకి రాఖీ కట్టిందో లేదో తెలియాల్సి ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ