కన్నడ మాజీ సీఎం కుమారస్వామి తన కొడుకు నిఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ 'జాగ్వర్' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని 75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ నిఖిల్ మాజీ ప్రధాని దేవెగౌడ కి స్వయానా మనవడు. 'జాగ్వర్' సినిమా ఆడియో వేడుకకి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడానికి ఈ మధ్య కుమార స్వామి.. పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం తెలిసిందే. ఇక 'జాగ్వర్' ఆడియో ఫంక్షన్ కి పవన్ వస్తాడని ప్రచారం ఊపందుకున్న వేళ... ఇప్పుడు మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే 'జాగ్వర్' సినిమాలో శృతిహాసన్ ఒక స్పెషల్ సాంగ్ చెయ్యబోతుందనేది ఈ న్యూస్. అంత పెద్ద హీరోయిన్ ఇంత చిన్న హీరో సినిమాలో నర్తిన్చడానికి ఒప్పుకుంటుందా అనేది ఇంకా సస్పెన్స్ గానే వుంది. అయితే 'జాగ్వర్' టీమ్ వాళ్ళు శృతిహాసన్ ని కలిసారని, ఆమె ఏమి సమాధానం ఇవ్వలేదని సమాచారం. మరి శృతి స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటే ఈ సినిమాకి ఇంకా హైప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అయినా చిన్న హీరో ల సినిమాలలో ఐటెం సాంగ్ చెయ్యడానికి ఈ మధ్య టాప్ హీరోయిన్స్ అసలు ఆలోచించడం లేదు. ఎందుకంటే భారీ పారితోషికం ముడుతుంది కాబట్టి. చిన్న హీరో, పెద్ద హీరో అని చూడడం లేదు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్. దీనికి ఉదాహరణగా తమన్నానే తీసుకోండి ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన 'అల్లుడు శీను' సినిమాలో దాదాపు కోటి పారితోషికం అందుకుని ఐటెం సాంగ్ లో నర్తించింది. మరి శృతి కి కూడా ఆ రేంజ్ లో పారితోషికం గనక ముట్టజెబితే ఐటెం సాంగ్ లో నటించడానికి సై అంటుందేమో చూద్దాం.