Advertisementt

సీనియర్ నటులూ.. చిరుపై అలిగారు!

Wed 24th Aug 2016 07:08 PM
chiranjeevi,chiranjeevi birthday celebrations,park hyatt,senior celebrities  సీనియర్ నటులూ.. చిరుపై అలిగారు!
సీనియర్ నటులూ.. చిరుపై అలిగారు!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ పార్టీ ఘనంగా జరిగింది. టి.సుబ్బరామిరెడ్డికి చెందిన హోటల్‌ దీనికి వేడుకైంది. ఆహ్వానాన్ని అందుకున్న అతిథులు ఒక్కొక్కరుగా చేరుకుని విందులో పాల్గొన్నారు. అయితే ఇక్కడే ఒక తిరకాసు ఉందనే మాట వినిపిస్తోంది. ఈసారి అతిథుల్లో కోత విధించారు. గత ఏడాది ఇదే వేదికపై జరిగిన విందులో పరిశ్రమలో అందరిని వ్యక్తిగతంగా ఆహ్వానించిన చిరంజీవి ఈసారి మాత్రం ఎంపికచేసిన వారినే పిలిచారట. పలువురు సీనియర్లను పక్కనపెట్టేశారని, సినీ నేపథ్యం ఉన్నవారినే పిలిచారనే మాట వినిపిస్తోంది. ఒకసారి పిలిచి మరోసారి పిలవక పోవడం పట్ల చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యంగ్‌ బ్యాచ్‌తో కలవడానికి, తద్వారా తను అప్‌డేట్‌ అని అనిపించుకోవడానికే పాతతరం వారిని పక్కనపెట్టినట్టు భావిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ