టాలీవుడ్ కి నయీమ్ తో లింకులు ఉన్నాయని బహిరంగంగా మీడియా ఎదుట.. నిర్మాత నట్టి కుమార్ మాట్లాడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో కొంత మంది నిర్మాతలతో నయీమ్ కి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని వారి పేర్లు కూడా బయట పెట్టాడు నట్టి కుమార్. వారు బండ్ల గణేష్, సి.కళ్యాణ్, అశోక్ కుమార్, సచిన్ జోషిలని పేర్లతో సహా చెప్పాడు. వీరు నయీమ్ తో సంబంధాలు పెట్టుకుని తనని బెదిరించారని చెప్పుకొచ్చాడు. ఇంకా తన థియేటర్ ని కూడా లాక్కున్నారని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి.... ఇంకా ఏపీ పోలీస్ లకు చెప్పానని... వారు అస్సలు పట్టించుకోలేదని అన్నాడు. అయితే నట్టి కుమార్ వ్యాఖ్యలకు స్పందించిన అచ్చెన్నాయుడు తనకు అసలు నట్టి కుమార్ అంటే ఎవరో తెలియదని..... నేను నా జీవితంలో నట్టి కుమార్ ని ఇప్పటివరకు కలవ లేదని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలకు నట్టి కుమార్ తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అవి నేను నిరూపించగలనని... కావాలంటే టీవీ 9 లో అచ్చెన్నాయుడితో ఫేస్ టూ ఫేస్ చర్చకు సిద్ధమని అంటున్నాడు. ఇంకా తాను మీడియా ముందు నయీమ్ గురుంచి మాట్లాడిన తర్వాత తనకు నయీమ్ వల్ల బాధింపపడిన వారు చాలా మంది ఫోన్ చేశారని ... నట్టి కుమార్ చెబుతున్నాడు. అయినా ఆధారాలు లేకుండా నట్టి కుమార్ ఒక బాధ్యత గల నాయకుడి పై ఇలాంటి నిందలు మోపడు కదా. మరి అచ్చెన్నాయుడేమో నాకే పాపం తెలీదు అంటున్నాడు. మరి ఇందులో నిజం ఎంత ఉంది తెలియాలి అంటే కొన్నాళ్ళు వేచి చూడక తప్పదు.