Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒకరోజు ముందే పండగ..!

Tue 23rd Aug 2016 09:37 PM
janatha garage,janatha garage release preponed,jr ntr,young tiger ntr,ntr janatha garage updates  ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒకరోజు ముందే పండగ..!
ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒకరోజు ముందే పండగ..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాని సెప్టెంబర్ 2 న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి  చేస్తున్నారు. సెప్టెంబర్ 2న మలయాళంలో, ఇంకా తెలుగులో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేసింది ఈ చిత్ర యూనిట్. అయితే సెప్టెంబర్ 2 న దేశవ్యాప్త బంద్ కి వామ పక్ష పార్టీలు పిలుపునిచ్చిన నేపధ్యం లో.... ఈ సినిమాని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తే సినిమా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తుందని సమాచారం. అయితే తెలుగులో పెద్ద ప్రభావం చూపకపోయినా మలయాళంలో ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని అందుకే సినిమాని విడుదల చేయాలా లేక పోస్ట్ పోన్ చేయాలా.. లేక ప్రీ పోన్ చేయాలా అనేది చిత్ర యూనిట్ తీవ్రంగా ఆలోచిస్తుందని సమాచారం. అయితే సినిమాని పోస్ట్ పోన్ చేసే ఉద్దేశ్యం లేదు కాబట్టి ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 1 న విడుదల చేయడానికి చూస్తున్నారని సమాచారం. సెప్టెంబర్ 1 న 'జనతా గ్యారేజ్' రిలీజ్ అవుతుంది అంటే  ఎన్టీఆర్ అభిమానులకి ఒకరోజు ముందుగానే పండగ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవచ్చన్నమాట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా సమంత, నిత్యా మీనన్ లు నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం ఈనెల 27 న పూర్తి చేసుకుంటుందని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ