ఎక్కడ చూసినా 'పెళ్లి చూపులు' హిట్ గురుంచే అందరూ మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా వచ్చి కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం గురుంచి ఇప్పుడు ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది. అదేమిటంటే 'పెళ్లిచూపులు' సినిమాని పూర్తి చేసిన తర్వాత డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమా ని ఏదైనా పెద్ద నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తే మంచి పేరు దానికి తోడు డబ్బు కూడా వస్తుందని అనుకుని ముందుగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ని సంప్రదించాడట. అయితే ఈ సినిమా తీసిన విధానం ఇంకా కథ నచ్చి..... దీనిలో అల్లు శిరీష్ నటిస్తే బావుంటుందని అనుకుని తనకి 'పెళ్లిచూపులు' సినిమా అమ్మెయ్యమని అడిగాడట. అయితే వాళ్ళు గనక సినిమాని అమ్మేస్తే ఈ సినిమాని అల్లు శిరీష్ తో రీ షూట్ చెయ్యాలని అల్లు అరవింద్ ప్లాన్ వేసాడట. శిరీష్ ఇప్పటి వరకు రెండు, మూడు సినిమాలలో నటించిన కూడా పెద్దగా పేరు రాలేదు అందుకే ఈ సినిమాలో గనక శిరీష్ నటిస్తే మంచి పేరు వస్తుంది.... ఇంకా అలాగే డబ్బు కూడా వస్తుందని అరవింద్ ఆశించాడట. కానీ తరుణ్ భాస్కర్ దీనికి ఒప్పుకోలేదట. ఇక తర్వాత ఈ చిత్ర యూనిట్ నిర్మాత సురేష్ బాబుని కలవడం అయన తన సంస్థ ద్వారా సినిమా రిలీజ్ చెయ్యడం, అది మౌత్ టాక్ తో ఇంకా పబ్లిసిటీ తో పెద్ద హిట్ అయ్యి కూర్చోవడం చకచక జరిగిపోయాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని తెలిసే అల్లు అరవింద్ ఆవిధంగా ప్లాన్ వేసాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇన్ని తెలివితేటలు ఉండబట్టే అల్లు అరవింద్ ని అపరచాణిక్యుడు అని అభివర్ణిస్తారు.