ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపిన విషయం ఇప్పటికి ఎవరు మరిచిపోయి వుండరు. తెలంగాణ ఎమ్యెల్సీ స్థానం కోసం రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆధ్వర్యంలో ఓటుకు నోటు వ్యవహారాన్ని నడిపించాడు. ఇందులో రేవంత్ రెడ్డి కి తెలుగు దేశం నేత జెరూసలేం ముత్తయ్య కూడా సహకరించాడని అభియోగం. ఈ ఓటుకు నోటును బయట పెట్టడానికి కేసీఆర్ వెనకాల ఉండి స్టీఫెన్ సన్ తో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఫోన్ టాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన పాత్రదారి రేవంత్ కు సహాయం చేసినందుకు గాను జెరూసలేం ముత్తయ్యకి కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముత్తయ్య అప్పటినుండి నన్ను టీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని నాకే పాపం తెలియదని నెత్తి నోరు బాదుకుంటూ చెబుతున్నాడు. విచారణలకు కోర్టుకు హాజరవుతూ ఉండగా..... ముత్తయ్య తప్పేం లేదని హై కోర్టు కేసును కొట్టివేయగా... తెలంగాణ సిఐడి....... ముత్తయ్య కూడా తప్పు చేసాడని సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు విచారణ ఈ రోజు (22-08-16) జరిగింది. ఈ కేసును సుప్రీం కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే విచారణకు హాజరైన ముత్తయ్య సంచలనాత్మకం గా మాట్లాడాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వల్ల తనకు ప్రాణ హాని ఉందని అంటున్నాడు. మొన్నటిదాకా నీకేం కాదు అని బుజ్జగించి ఇప్పుడు చంపడానికి చూస్తున్నాడని చెబుతున్నాడు. మరి ముత్తయ్య ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు. ఇలా మాట్లాడితే తనపై ఉన్న కేసులు ఎత్తేస్తామని ఎవరన్నా అన్నారా... లేక అలా మాట్లాడమని ఎవరన్నా బెదిరించారా అనేది తెలియదు. కానీ ముత్తయ్య మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు. తనకు తన కుటుంబ సభ్యులకు ఏ హాని జరిగినా దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని అంటున్నాడు.