రియో ఒలింపిక్స్‌లో భారత్ తరుపున ఒకరు రజత పథకం తేగా... మరొకరు కాంస్య పతాకాన్ని తెచ్చారు. తెలుగు రాష్ట్రాలనుండి వెళ్లిన పి.వి సింధు బ్యాట్మెంటన్ లో భారత దేశానికి రజత పథకాన్ని, హర్యానా నుండి వెళ్లిన సాక్షి మాలిక్ కాంస్య పథకాన్ని తెచ్చి ఇండియా పేరు ప్రపంచం లో మారుమ్రోగేలా చేశారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ విన్నా వీరి పేర్లే వినబడుతున్నాయి. అంతే కాకుండా వీరికి ఘనస్వాగతం పలకడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కదిలి వచ్చాయి. ఇంకా వీరికి బహుమతుల రూపం లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు...... కొన్ని కోట్ల రూపాయలను ప్రకటించాయి. ఇండియా అంతటా పండగ వాతావరణం కనబడుతున్న వేళ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియో ఒలింపిక్స్ గురుంచి, భారత పథకాల గురుంచి కొన్ని కామెంట్స్ చేసాడు. భారత్ కి రెండే రెండు పథకాలు వచ్చాయి. దానికే అందరు ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు. అదే 32 కోట్లమంది జనాభా ఉన్న అమెరికా చూడండి.. 46 బంగారు పథకాలు సాధించింది. అంతే కాదు 5 కోట్లు జనాభా వున్నా దక్షిణ కొరియా కూడా 9 బంగారు పథకాలు సాధించింది. మరి మన జనాభా దాదాపు 120 కోట్లు జనాభా ఉండి మనవాళ్ళు కేవలం రెండు పథకాలనే సాధించారు. దానికే ఈ ఉత్సవాలు... సంబరాలు చేసేసుకుంటున్నారు. మనకే ఇలా ఉంటే అన్ని పథకాలు సాధించిన ఆయా దేశాలు ఇంకెంత సంబరాలు చేసుకోవాలి అని ఎద్దేవా చేసాడు. మరి మనకి వచ్చిన ఆ పథకాలే మనకు గొప్ప అవి వేరే వాళ్ళతో పోల్చి చూడడం సరికాదు కదా అంటున్నారు క్రీడాభిమానులు. వర్మ ఖాళీగా ఉండి ఏమి చెయ్యాలో తెలీక ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటాడు.. అని లైట్ తీసుకుంటున్నారు జనాలు.