Advertisementt

జోరుమీదున్న నాని...!

Mon 22nd Aug 2016 05:26 PM
actor nani,speed,new movies,20 crores club,busy,majnu,nenu local  జోరుమీదున్న నాని...!
జోరుమీదున్న నాని...!
Advertisement
Ads by CJ

ఇటీవలి కాలంలో వరుస విజయాలతో నేచురల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న యువహీరో నాని. ప్రస్తుతం ఆయన 'ఉయ్యాల జంపాల' ఫేమ్‌ విరించి వర్మతో 'మజ్ను' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నాని స్టైల్‌ ఆఫ్‌ కామెడీతో రొమాంటిక్‌ మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అందరినీ ఎంతో బాగా ఆకర్షిస్తోంది. కాగా ఈచిత్రాన్ని సెప్టెంబర్‌ 17న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాని ప్రస్తుతం 'నేను లోకల్‌' చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూనే.... 'మజ్ను'కి చెందిన డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేశాడు. ఇలా తన కెరీర్‌ను ఎంతో బిజీగా.... అదే సమయంలో ఎంతో జాగ్రత్తగా నాని ప్లాన్‌ చేసుకుంటున్నాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి మొదలైన నాని విజయపరంపర నిన్నటి 'జెంటిల్‌మేన్‌' వరకు కొనసాగింది. తన రాబోయే రెండు చిత్రాలు సక్సెస్‌ అయితే ఇప్పటికే రూ.20కోట్ల మార్కెట్‌ను సాదించుకున్న నాని స్టామినా 30కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ