రీమేక్ సినిమా అంటేనే అది ఏదో ఒక భాషలో విజయవంతంగా ప్రదర్శించబడిందే అయ్యి ఉంటుంది. దాన్ని తీసుకున్న వారు రీమేక్ లంటూ మరికాస్త అందాన్ని మెరుగుపట్టి... లేకపోతే తొలగించో చేస్తూ ఉంటారు. అయితే రీమేక్ చేయడమే కాదు, వాటితో ఎలా కమర్షియల్ గా మలిచి హిట్టు కొట్టాలా అన్నది కూడా బాగా తెలిసిన కథానాయకుడు వెంకటేష్. అసలు వెంకటేష్ బాబు రీమేక్ లతోనే చాలా సినిమాలను హిట్ కొట్టాడు. అందులో బాగా రాణించాడు. కాగా ఒక స్ట్రయిట్ సినిమా, రెండు రీమేక్‌లు అన్న రేంజ్ లో వెంకీ ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు కూడా హిందీ సినిమా `సాలా ఖడ్డూస్` రీమేక్‌లో నటిస్తున్నాడు వెంకీ. అంతే కాకుండా ఇంకా మరికొన్ని మలయాళం, హిందీ సినిమాలపై కూడా ఆయన కన్నేసినట్టుగానే అర్థమౌతుంది. ఇంకా సల్మాన్‌ఖాన్ నటించిన ‘సుల్తాన్’ రీమేక్‌లోనూ నటించడానికి వెంకీ తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.
రీసెంట్ గా ఈ చిత్రాన్ని చూశాడట వెంకీ. తర్వాత వెంకీ మాటల సందర్భంలో ఈ గెటప్ నాకు బాగానే సూట్ అవుతుందే.... అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని పరిశ్రమ టాక్. తమ్ముడు అనడమే ఆలస్యం. ఇంకేముందు అన్న సురేష్‌బాబు ఆ సినిమా రీమేక్ రైట్స్‌కోసం అప్పుడే ప్రయత్నాలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. సల్మాన్‌ఖాన్ ఆ సినిమాలో కండలవీరడులా దర్శనమిస్తాడు. మరీ వెంకీ అల్లాంటి వీరలెవల్లో కండలు పెంచగలడా? కాగా `సుల్తాన్` సినిమా రీమేక్ కూడా ఇప్పుడే చేసేయ్యాలన్నది వీరి అభిప్రాయం. కాగా ఈ రెండు సినిమాలకు కలిపి ఒకేసారి కండలు పెంచితే సరిపోతుందని అదే పనిలో మన బాబు బంగారం ఉన్నట్లుగా తెలుస్తుంది.