Advertisementt

సమంతకు... చైతూకు మధ్య ఏం నడుస్తోంది..?

Sun 21st Aug 2016 03:11 PM
samantha,naga chithanya,gossips,shocks,twists,marriage,akkineni family,nagarjuna,movies  సమంతకు... చైతూకు మధ్య ఏం నడుస్తోంది..?
సమంతకు... చైతూకు మధ్య ఏం నడుస్తోంది..?
Advertisement
Ads by CJ

సినీ హీరో నాగచైతన్య,  అందాల భామ సమంత చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రేమ, పెళ్లి వరకు వచ్చింది. కానీ అక్కడే తొనికిసలాడిపోతుంది. అందరినీ బొంకిస్తుంది. అసలు వీరిద్దరి వ్యవహారం ఏంటి అని టాలీవుడ్‌లో అందరూ చర్చించుకుంటున్నారు. చూడబోతే అచ్చం సినిమాలో వలెనే వీరి వ్యవహారం నడుస్తుంది. బయటికి చెప్పలేక, మింగలేక తర్జనభర్జనలో వారి అవస్త ఉన్నట్టు వారిని గమనిస్తున్న వారికి అట్టే తెలిసిపోతుంది. ఈ మధ్య కాలంలో సమంత తమ ప్రేమ వ్యవహారంపై  మీడియాతో ముచ్చటిస్తూ తన ప్రియుడు ఎవరనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అది కాస్త మీడియా ద్వారా అందరికీ తెలిసి రచ్చకెక్కడంతో, సమంతను నాగ్ కాస్త మందలించడం కూడా జరిగింది. నిన్నటికి మొన్న వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని.. 'జనతా గ్యారేజ్' సమంత చివరి సినిమా అని కూడా  గాసిబ్స్ నడిచినవి. అందుకు అవుననే సంకేతాలిస్తూ  ధనుష్ సినిమా అయిన ‘వడ చెన్నై’ నుంచి సమంత తప్పుకోవడం అప్పట్లో ఇందుకేనేమో అని కూడా అందరూ భావించారు. సమంత  ఆ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగి వెనక్కి పంపించింది. దీంతో అభిమానులందరూ ఆ విషయానికి ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు మరో షాక్ ఏంటంటే కోలీవుడ్ లో వర్దమాన హీరో  అయిన శివ కార్తికేయన్ సరసన నటించేందుకు సమంత ఫిక్స్ అయిపోయిందట. ఈ సినిమాను పొనరమ్ అనే సంచలన దర్శకుడు చేస్తున్నాడు. అసలు సమంత  ఎందుకింత కలవరానికి గురౌతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని ఆమె డైలాగ్ ఉంది చూడండి. 'నేను హర్ట్ అయ్యా. బుంగమూతి పెట్టుకున్నా.. చూడు చూడు' అంటుంది. అలా ఉంది పాపం సమంత ప్రస్తుత పరిస్థితి. అసలు సమంత, నాగ చైతన్యల ప్రేమకు ఎక్కడ తేడా వస్తుంది. ఇద్దరికీ ఈ చిన్న చిన్న మనస్పర్ధలు ప్రేమలో మామూలేలే అని అభిమానులు వదిలేద్దామనుకుంటే అలా కాదే. మొన్నెప్పుడో నాగార్జున నాగ్ చైతన్యను కాస్త ఘాటుగానే 'మీ పెళ్ళిళ్ళు మీ ఇష్టం' అన్నాడన్న వార్త భయటకు వచ్చింది. దీన్ని బట్టి అసలు సమంతకు, అక్కినేని కుటుంబానికి మధ్య ఏం జరుగుతోంది? అనే విషయం టాలీవుడ్‌ నే బాధిస్తుంది. చూద్దాం సమంత ముందు ముందు మరెన్ని షాక్ లు ఇవ్వనుందో..?