జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాన్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి గౌడ సమావేశమయ్యారు. వారిరువురి సమావేశం తర్వాత కుమార స్వామి గౌడ మాట్లాడుతూ పవన్ కళ్యాన్ తనకు చాలా కాలం నుండి మంచి మిత్రుడని, మా ఇద్దరి భేటీలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించాడు. అయితే త్వరలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ 'జాగ్వార్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఎ. మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దీప్తి కథానాయికగా నటించింది. కాగా ఈ మధ్యనే ఈ సినిమా టీజర్‑ను హైదరాబాద్ లో విడుదల చేయడం కూడా జరిగింది. ఈ సినిమా విషయాలను పవన్ తో ప్రస్తావించి వారి ఆశీస్సులు తీసుకుందామనే వచ్చానన్నాడు కుమార స్వామి గౌడ.
తర్వాత పవన్ కల్యాణ్ ఈ భేటీపై స్పందిస్తూ... తనకు కుమారస్వామి మిత్రుడన్నాడు. ఈ భేటీలో ఎటువంటి రాజకీయ అంశాల ప్రస్తావన రాలేదు. కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ కుమార్ సినీరంగ ప్రవేశంపై మాత్రమే మా ఇద్దరి భేటీలో ప్రస్తావించిన అంశాలుగా చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు తను వెళ్లడం లేదని చెప్పేశాడు. పనిలో పనిగా మరొక రహస్యం కూడా చెప్పాశాడు.
అప్పుడెప్పుడో ఏప్రియల్ 30వ తేదీన ప్రత్యేక హోదాపై ట్వీట్ చేసిన పపన్ తిరిగి ఈరోజు దానిపై స్పందించాడు. అదేంటంటే అది చాలా సున్నితమైన అంశం అంట. ఆ విషయంలో నోరు జారకూడదంట. ఇంకా అప్పట్లో అంటే విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంట. ఇది పవన్ కళ్యాన్ చెప్పింది. కానీ చివరలో ఓ గొప్ప విషయం చెప్పారు. తాను హోదా విషయంలో చాలా మదన పడుతున్నానని, ఏదో ఒకటి చేయాలని నాకూ ఉందని వెల్లడించాడు.