Advertisementt

మలయాళీలకు థ్యాంక్స్‌ చెప్పిన బన్నీ....!

Sat 20th Aug 2016 10:07 PM
allu arjun,malayalam,star asia net middle east,pravasi ratna award,dubai  మలయాళీలకు థ్యాంక్స్‌ చెప్పిన బన్నీ....!
మలయాళీలకు థ్యాంక్స్‌ చెప్పిన బన్నీ....!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుని, చిత్ర చిత్రానికి తన నటన, డ్యాన్స్‌లలో మరింత కొత్తదనం కోసం ప్రయత్నించే స్టార్‌గా అల్లు అర్జున్‌ను చెప్పుకోవచ్చు. అందుకే ఆయన వరస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాగా ఈ మెగాఫ్యామిలీ హీరోకి కేరళలో కూడా పెద్ద క్రేజ్‌ ఉంది. అక్కడ కూడా ఆయనకు ఫ్యాన్స్‌ బేస్‌ చాలా ఎక్కువేనని చెప్పవచ్చు. తెలుగులో ఫ్లాప్‌ అయిన ఆయన చిత్రాలు మలయాళంలో మంచి హిట్లు అవుతున్నాయంటే ఆయనకు అక్కడ ఉన్న క్రేజ్‌ను అర్దం చేసుకోవచ్చు. అయితే ఓనం పండుగను పురస్కరించుకొని  'స్టార్‌ ఏషియా నెట్‌ మిడిల్‌ ఈస్ట్‌ సంస్ద' ఆయనకు 'ప్రవాసీ రత్న' అవార్డును ఆగష్టు 19 న దుబాయ్ లో జరిగిన వేడుకలో అందించారు. దుబాయ్‌లోని వరల్డ్‌ట్రేడ్‌సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లుఅర్జున్‌ ఈ అవార్డును అందుకొని తనను ఇంతగా ఆదరిస్తున్న మలయాళీలకు స్పెషల్‌ థాంక్స్‌ చెప్పాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ