Advertisementt

లేడీ డైరెక్టర్‌ మంచి ప్రాజెక్ట్‌ పట్టేసింది...!

Sat 20th Aug 2016 04:56 PM
nandini reddy vijay devarakonda pelli choopulu movie malavika heroine best movie  లేడీ డైరెక్టర్‌ మంచి ప్రాజెక్ట్‌ పట్టేసింది...!
లేడీ డైరెక్టర్‌ మంచి ప్రాజెక్ట్‌ పట్టేసింది...!
Advertisement
Ads by CJ

ఈమధ్య కాలంలో 'పెళ్ళి చూపులు' చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం అతిపెద్ద హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రంలో నటించిన నటీనటులకు కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో తనదైన బాడీలాంగ్వేజ్‌తో అందరినీ ఆకట్టుకున్న విజయ్‌ దేవరకొండకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా రొమాంటిక్‌ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్‌ నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో... ఆమె హీరోగా విజయ్‌ దేవరకొండను తీసుకుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో ఆయన సరసన 'ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే' చిత్రాల హీరోయిన్‌ మాళవిక నాయర్‌ నటించనుంది. కాగా ఈ చిత్రాన్ని వైజయంతీ బేనర్‌లో రూపొందనుంది. మొత్తానికి ఇది విజయ్‌ దేవరకొండకే కాదు.... నందిని రెడ్డికి బెస్ట్‌ చాన్స్ అనుకోవాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ