మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత అంత క్రేజ్, ఇమేజ్ సంపాదించుకున్నది పవర్‌స్టార్ పవన్‌కళ్యాణే అన్నది నిజం. దీంతో అందరి స్టార్‌హీరోల కొడుకుల్లాగే పవన్ తనయుడు అకిరా నందన్ కూడా హీరోనే అవుతాడని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. కాగా పవన్ తనయుడు అకిరా నందన్ త్వరలో తెరపై కనిపించనున్నాడు. అది వెండితెరపై కాదు.... బుల్లితెరపై. 2014లో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం 'ఇష్క్ వాలా లవ్'. ఈ చిత్రం మరాఠీలో మంచి విజయం సాధించింది. తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు. ఈ చిత్రంలో అకిరా కొంతసేపు తెరపై కనిపిస్తాడు. ఈచిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ సెప్టెంబర్ 4న ఈటీవీ లో ప్రసారం కానుంది. దీంతో ఆ రోజు ఎప్పుడు వస్తుందా! అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల కోరిక సెప్టెంబర్ 4న తీరనుంది. దీంతో ఆ రోజు ఈటీవీ టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోవడం ఖాయం అంటున్నారు.