ఏడాది కిందటి వరకు తమన్నా కెరీర్ ఇబ్బందుల్లో పడింది. టాలీవుడ్ విషయానికి వస్తే 'బాహుబలి1, ఊపిరి' చిత్రాలు విజయం సాధించడంతో తమ్మూ దశ తిరిగింది. మరీ ముఖ్యంగా 'బాహుబలి' దేశంలోని అన్ని భాషల్లో సూపర్‌హిట్ కావడంతో ఆమెకు మరింత ప్లస్ అయింది. గతంలో ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమె బాలీవుడ్‌లో నటించిన నాలుగు చిత్రాలు కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఇక ఈ అమ్మడుకు బాలీవుడ్‌లో ఐరన్‌లెగ్ ముద్రపడింది. బాలీవుడ్ ప్రయత్నాలు పక్కనపెట్టి దక్షిణాది చిత్రాలపైనే ఆమె దృష్టి పెడతున్నట్లు కనిపించింది. అయితే 'బాహుబలి' చిత్రం బాలీవుడ్‌లో కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇప్పుడు ఏకంగా రెండు బాలీవుడ్ చిత్రాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె ప్రస్తుతం 'రణవీర్ చింగ్ రిటర్న్స్' తో పాటు తెలుగు 'ఊపిరి' బాలీవుడ్ రీమేక్‌లో కూడా నటిస్తోంది. అయితే బాలీవుడ్ లో కూడా సెక్రటరీగా తమన్నాకే ఓటువేశాడు ఈ చిత్రం రైట్స్ తీసుకున్న కరణ్‌జోహార్. మరి ఈ రెండు చిత్రాలతో నైనా తమన్నా బాలీవుడ్‌లో కూడా విజయాలు సాధిస్తుందో లేదో చూడాల్సివుంది.