దర్శకుడు మురుగుదాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాకు బిజినెస్ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే మహేష్ సినిమాకు మార్కెట్ లో మంచి వాల్యూ ఉంది కాబట్టి ఓవర్సీస్ లో మంచి రేటు కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిది టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి నిర్మించనున్నారు. దీంతో ఈ సినిమా బిజినెస్ పై భారీస్థాయిలో అంచనాలు మొదలయ్యాయి. దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు హడలిపోతున్నారని సమాచారం అందుతుంది.
ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఈ సినిమా నిర్మాతలు ఓవర్సీస్ రైట్స్ ను రూ.25 కోట్లు వరకూ పలికేలా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఓవర్సీస్ హక్కులను కొందామనుకున్న డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తుతున్నారని రహస్యంగా సమాచారం అందుతుంది. ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా రూ.15 కోట్లకు అయితే పోతుందని, అంతకు మించి కష్టమని కూడా టాక్. కానీ రెండు భాషల్లో విడుదల కానుందనే భావంతో రూ.25 కోట్లు ఈజీగా వసూళ్ళను రాబడుతుందని వాళ్లు నమ్ముతున్నారు. మొత్తానికి మహేష్ బాబు సినిమాకు ఓవర్సీస్ రేట్లతో డిస్ట్రిబ్యూటర్లు కుదేలు పడుతున్నారని విషయం మాత్రం వాస్తవం.