ప్రముఖ రచయిత్రి శోభా డేపై భారత్ అంతా కారాలు మిరియాలు నూరుతుంది. శోభా డే కొన్ని రోజుల క్రితం ఒక మెసేజ్ లో 'మనవాళ్ళు రియో వెళతారు. సెల్ఫీలు తీసుకొంటారు. ఎంజాయ్ చేస్తారు. ఒట్టి చేతులతో భారత్ తిరిగి వస్తారు. అసలు వాళ్ళని పంపడం డబ్బు వృథా, విలువైన సమయం కూడా వృథా చేసుకోవడమే' అని విమర్శించింది. భారతీయ క్రీడాకారులకి తగినంత శిక్షణ లేకపోయినప్పటికీ గట్టిపోటీని ఇవ్వడంలో కూడా ఆనందం ఉంటుంది. అది అనుభవించిన వారికి తెలుస్తుంది. నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేవారికేం తెలుస్తుంది. సాక్షి మాలిక్ భారత్ కి రజత పతకం తేవడానికి చాలా శ్రమించింది. ఆమె తరువాత సింధూ కూడా నిన్న సెమీ ఫైనల్స్ లో విజయం సాధించి భారత్ కి మరో పతకం ఖాతాలో వేసింది. ఇలా వీరిద్దరూ తమ ప్రతిభా పాటవాలని చక్కగా ప్రదర్శించి భారత్ కి పతకాలు సాధించగానే యావత్ దేశ ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. కానీ శోభాడే మాత్రం వెటకారంతో అహంకారాన్ని ప్రదర్శిస్తూ 'సిల్వర్ రాణి- సింధూ' అని మెసేజ్ పెట్టింది. అంటే దీని అర్ధం సింధూకి బంగారు పతకం సాధించే శక్తి లేదు, ఆమెకి వెండి పతకం సాధించడమే ఎక్కువ అన్నట్లు ఎగతాళి చేసినట్లేగా మరి.
ఈ విషయంలో క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కౌంటర్ వేస్తూ 'సాక్షి మెడలో కాంస్య పతకం ఎంతో శోభను ఇస్తోంది' అన్నాడు. ఇంకా బాలీవుడ్ స్టార్ 'రియో వెళ్ళి మీరు ఒట్టి చేతులతో రావడం లేదు పతకాలు తీసుకొని వస్తున్నారు. మాకు మీతో సెల్ఫీ తీసుకోవాలని ఉంది' అంటూ శోభాడే కి దిమ్మ తిరగేలా ట్వీట్ల పంచుల్ పడుతున్నాయి. దీనిపై శోభా డే ఎలా స్పందిస్తుందో చూడాలి.