Advertisementt

'బిచ్చగాడు'పై మరో ఆసక్తికర వార్త...!

Fri 19th Aug 2016 04:42 PM
bichagadu movie,vijay antony,bichagadu remake,bollywood,director sasi,hero  'బిచ్చగాడు'పై మరో ఆసక్తికర వార్త...!
'బిచ్చగాడు'పై మరో ఆసక్తికర వార్త...!
Advertisement
Ads by CJ

తెలుగులో తమిళ డబ్బింగ్‌ సినిమాగా వచ్చిన 'బిచ్చగాడు' చిత్రం 'సరైనోడు, బ్రహ్మ్మోత్సవం' వంటి పెద్ద చిత్రాలను కూడా కాదని.. ఇప్పటికీ నిర్మాతకు కోట్లాది రూపాయల లాభాలను తెస్తునే ఉంది. విడుదలై శతదినోత్సవానికి రెడీ అవుతున్న ఈ చిత్రం ఇప్పటికీ 70శాతం ఆక్యుపెన్సీ రేటుతో కొన్ని కేంద్రాలలో అదరగొడుతోంది. విజయ్‌ ఆంటోని హీరోగా దర్శకుడు శశి అద్భుతమైన టేకింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాగా ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో ఫాక్‌స్టార్స్‌ స్టూడియోస్‌ సంస్ద హిందీలోకి రీమేక్‌ చేయనుందని సమాచారం. తెలుగులో లాగా హిందీలో కూడా ఈచిత్రానికి మంచి విజయావకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. బాలీవుడ్‌లో కూడా మరలా విజయ్‌ ఆంటోనినే హీరోగా శశినే డైరెక్టర్‌గా ఈచిత్రం తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం విజయ్‌ ఆంటోని, శశిలు తమ తమ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు ఫ్రీ అయిన వెంటనే 'బిచ్చగాడు' రీమేక్‌ను విజయ్‌తోనే చేయాలా? లేక ఎవరో ఒక బాలీవుడ్‌ హీరోతో చేయాలా? అనే విషయం ఓ కొలిక్కిరానుంది. ఇక హీరో విజయ్‌ ఆంటోని ప్రస్తుతం 'బేతాళుడు' (సైతాన్‌) అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. మరి 'బేతాళుడు' గా కూడా విజయ్‌ ఆంటోని తెలుగులో విజయం సాధిస్తే అతనికి త్వరలోనే తెలుగులో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ