Advertisementt

రజనీకాంత్ కంటే సుదీప్ గొప్ప నటుడా..!

Fri 19th Aug 2016 02:06 PM
ram gopal varma,sudeep,rajinikanth,vishnuvardhan,twitter,varma comments  రజనీకాంత్ కంటే సుదీప్ గొప్ప నటుడా..!
రజనీకాంత్ కంటే సుదీప్ గొప్ప నటుడా..!
Advertisement
Ads by CJ

సీనియర్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిత్యం తనకు తోచిన అంశాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు. అలా నిత్య చైతన్యంతో జీవిస్తుంటాడు. కానీ ప్రేక్షకులను మాత్రం కొన్ని కొన్ని సార్లు పిచ్చెక్కిస్తుంటాడు. ఆ రకంగా వివాదమైన ట్వీట్లే ఆయన జాబితాలో ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఇప్పుడు  కన్నడ స్టార్ యాక్టర్ సుదీప్ నటనను అమితంగా మెచ్చుకున్నాడు వర్మ. అయితే ఆ మెచ్చుకొనే క్రమంలో రజనీకాంత్, కన్నడ నటుడు విష్ణువర్ధన్ కంటే సుదీప్ మంచి నటుడు అనేశాడు. అదీ...  ఆ రకంగా ఇప్పుడు ఆ ట్వీట్స్ దుమారం రేపుతున్నాయి. దివంగత కన్నడ నటుడు విష్ణువర్ధన్‌తో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై వర్మ చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. కాగా ఈ మధ్యనే విడుదలైన  ‘కిచ్చా’ సుదీప్ సినిమా, ‘కోటిగొబ్బ-2’ని చూసిన వర్మ ట్విటర్‌ ద్వారా ‘రజనీకాంత్ కేవలం స్టైల్‌తో నెగ్గుకొస్తున్నాడు. అసలు రజినీ జీవితంలో ఎంత కష్టపడినా 'ఈగ' వంటి సినిమాలో సుదీప్ పాత్రను పోషించలేడు. ‘కోటిగొబ్బ-2’లో సుదీప్ నటనతో పోల్చితే ‘కోటిగొబ్బ-1’లో విష్ణువర్ధన్ సరిగా చేయలేదు’ అనేశాడు.

అయితే వర్మ ట్వీట్స్ కు స్పందించిన సుదీప్.. విష్ణువర్ధన్, రజనీకాంత్ వంటి నటదిగ్గజాలతో నన్ను పోల్చడం వర్మకు అంత మంచి విషయం కాదని వెల్లడించాడు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ