ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మించే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం 'వీరం' మూలకధను ఆధారంగా చేసుకొని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ నటిస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయాలని పవన్ దర్శకనిర్మాతలకు స్పష్టం చేసేశాడు. ఈ చిత్రం తర్వాత పవన్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఎప్పటనుండో ఎ.యం.రత్నం పవన్‌తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాడు. పవన్‌తో తాను ఓ సినిమా నిర్మించబోతున్నట్లు రత్నం కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. తమిళంలో తానే నిర్మాతగా అజిత్ హీరోగా చేసిన 'వేదాలం' చిత్రానికి రీమేక్‌గా ఈచిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి తమిళ 'జిల్లా' దర్శకుడు నీసన్ దర్శకత్వం చేయనున్నట్లు సమాచారం. ఇక దాసరితో కూడా పవన్‌కు ఓ చిత్రం కమిట్‌మెంట్ ఉంది. సో.. మరో మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి ఎంటర్ అవుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి పవన్ చేస్తున్న చిత్రాలు, ఆయన కమిట్‌మెంట్స్ వింటుంటే ఆయన మూడేళ్ల డైరీ ఇప్పటికే ఫుల్ అయినట్లు కనిపిస్తోంది.