Advertisementt

సావిత్రిగా చెయ్యడానికి ఒప్పుకుంటుందా!

Fri 19th Aug 2016 06:52 AM
nithya menon,savitri,mahanati movie,sr ntr,anr,nithya green signal  సావిత్రిగా చెయ్యడానికి ఒప్పుకుంటుందా!
సావిత్రిగా చెయ్యడానికి ఒప్పుకుంటుందా!
Advertisement
Ads by CJ

'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో దర్శకునిగా పరిచయమై మంచి టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు నాగ్‌ అశ్విన్‌. తాజాగా ఆయన మహానటి సావిత్రి జీవిత కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకొని పక్కా స్క్రిప్ట్‌తో రెడీఅయ్యాడు. కాగా దక్షిణాదిన ఓ ఊపు ఊపి మహానటి అన్న పదానికే అర్దం తెచ్చిన సావిత్రి పాత్రలో ఎవరిని తీసుకోవాలా? అని ఆలోచిస్తున్న నాగ్‌ అశ్విన్‌ ఎట్టకేలకు సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నిత్యామీనన్‌ అయితేనే దక్షిణాదిలో ఈ చిత్రానికి మంచి మార్కెట్‌ రావడంతో పాటు... నిత్యా అయితేనే ఆ మహానటి పాత్రకు పూర్తిగా కాకపోయినా కనీసం తన వంతు టాలెంట్‌తో న్యాయం చేయగలదని నాగ్‌ అశ్విన్‌ భావించాడు. త్వరలో నిత్యా కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందని ఆ తర్వాత ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఇక సావిత్రి జీవిత చరిత్ర అంటే అందులో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ పాత్రలు కూడా ముఖ్యభూమిక పోషించాయి. మరి వారి పాత్రలకు ఎవరిని ఎంచుకుంటాడో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ