Advertisementt

స్నేహం కోసం గెస్ట్‌ పాత్రలు..!

Thu 18th Aug 2016 07:14 PM
friendship,guest,guest cerectors,nani with raj tarun,sundeep kishan with sai dharam tej  స్నేహం కోసం గెస్ట్‌ పాత్రలు..!
స్నేహం కోసం గెస్ట్‌ పాత్రలు..!
Advertisement
Ads by CJ

స్నేహం కోసం మన హీరోలు తమ ప్రాణాలు దారపోస్తారో లేదో తెలియదు కానీ తమ స్నేహితుల కోసం కొన్నిచిత్రాల్లో అతిథి పాత్రలు చేస్తున్నారు. సందీప్‌కిషన్‌కు మంచి ఫ్రెండ్‌ అయిన సాయిదరమ్‌తేజ్‌ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నక్షత్రం' చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను చేయనున్నాడు. సందీప్‌తో ఉన్న స్నేహం, కృష్ణవంశీపై ఉన్న గౌరవంతో ఆయన ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక నాని హీరోగా 'ఉయ్యాల జంపాల' ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'మజ్ను' చిత్రంలో రాజ్‌తరుణ్‌ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన విరించి వర్మతో ఉన్న స్నేహం వల్లే రాజ్‌తరుణ్‌ ఈ చిత్రంలో అతిథిపాత్రను చేయనున్నాడని సమాచారం. ఇక అల్లుఅర్జున్‌, నాగార్జున, వెంకటేష్‌, చిరంజీవి వంటి స్టార్స్‌ సైతం తమ కుటుంబ హీరోల కోసం కొన్ని చిత్రాల్లో అతిధిపాత్రలు చేసిన, చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీకాంత్‌ తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న నాగార్జున శ్రీకాంత్‌తో ఉన్న స్నేహం కారణంగానే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ