అసలే శ్రావణమాసం. మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో టాలీవుడ్ దర్శకులు ఒకరొకరుగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారవుతున్నారు. దర్శకుడు క్రిష్ వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి కోసం బాలయ్య 100వ చిత్రంగా రూపొందుతున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' షూటింగ్‌కు కూడా క్రిష్ తాత్కాలికంగా బ్రేక్ వేశాడు. ఇక 'అందాల రాక్షసి' చిత్రంతో దర్శకునిగా పరిచయమై, ఆ తర్వాత నాని హీరోగా 'కృష్ణగాడి వీరప్రేమగాధ'తో మంచి హిట్ కొట్టిన టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి వివాహం త్వరలో జరగనుంది. ఈయన చేతిలో ఇప్పటికే నితిన్, అఖిల్‌ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక దర్శకత్వ గోలలో పడిపోయి చివరకు 'ఇష్క్, మనం, 24' వంటి చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడవుతున్నాడు. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులతో ఇండస్ట్రీలో పెళ్లి కళ వచ్చేసిందనే చెప్పాలి.